సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘‘డ్రాగన్’ మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్‌ను జూ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో నేడు, బుధవారం ఉదయం మేకర్స్ విడుదల చేశారు. 4 నిమిషాల 28 సెకన్ల భారీ నిడివితో వచ్చిన ఈ వీడియో డ్రాగన్ పిరియాడికల్ ప్రపంచాన్ని, అందులోని పాత్రలను పరిచయం చేసింది. తారక్ ‘లూగర్’ అనే పవర్‌ఫుల్ మాస్ రోల్‌లో కనిపించారు తారక్ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు.అయితే చిక్కిపోయిన ఎన్టీఆర్ ను చూడటం కాస్త ఇబ్బందిగానే ఉంది. మరి సినిమాలో పాత్ర తీరు అలానే ఉండాలా ? చూద్దాం.. 1967లో నల్లమందు తోటలు, నల్లమందు యుద్ధాలు, ప్రమాదకరమైన ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, డేంజరస్ డ్రగ్ పెడ్లర్స్ వంటి అంశాలను ఈ గ్లింప్స్ లో ప్రస్తావించారు. అది కెజిఎఫ్ సినిమా స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉంది. అనిల్ కపూర్ ఒక పాత్రలో మెరిశారు. హీరోయిన్ రుక్మిణి వసంత్ రోల్ ద్వారా ఎన్టీఆర్ పాత్ర ఎదుగుదలను పరిచయం చూపించారు.. ఎన్టీఆర్ లీన్ అండ్ రఫ్ లుక్, గంభీరమైన వాయిస్ ప్రత్యేకంగా నిలిచాయి. ”దేవుడు నాకో గొప్ప వరం ఇచ్చాడు. ట్రిగ్గర్ నొక్కగానే మార్చిపోవడం. నిద్రపోయినప్పుడు నేను చంపినవాళ్ల ముఖాలు నా కలలోకి రావు. మిగిలున్న శత్రువుల ముఖాలే కనబడతాయి. పొరపాటున కూడా నువ్వు నా కలలోకి రావొద్దు” అంటూ తనదైన బేస్ వాయిస్ తో చెప్పే ఇంటెన్స్ అండ్ పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *