సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ ఆసియా ఉద్రిక్తలు సుదీర్ఘ కాలం కొనసాగుతున్న వేళా.. భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు, శుక్రవారం నాటి ట్రేడింగ్‌ను లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు పైకి కదిలాయి.నేటి ముగింపు సమయానికి బిఎస్ఇ సెన్సెక్స్ (BSE Sensex) 231.99 పాయింట్లు (0.31%) లాభపడి 75,415.35 వద్ద స్థిరపడగా.. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50 (Nifty 50) 64.60 పాయింట్లు (0.27%) పెరిగి 23,719.30 వద్ద ముగిసింది. ట్రేడింగ్ మధ్యలో సెన్సెక్స్ 75,810.97 వద్ద, నిఫ్టీ 23,835.65 వద్ద ఈరోజు గరిష్టాలను తాకాయిబ్యాంక్ నిఫ్టీ ఈ వారంలో 52,800 స్థాయిల వద్ద గట్టి సపోర్ట్ తీసుకోవడంతో బ్యాంకింగ్ రంగంలో కరెక్షన్ ముగిసి తిరిగి బలం పుంజుకునే సంకేతాలు కనిపించాయి. ఐటీ (IT) రంగంలో వరుసగా మూడో రోజు ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. లార్జ్‌క్యాప్స్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు ఈరోజు కాస్త వెనుకంజ వేసాయి..
