సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా ఎవరికీ పింఛనులు మంజూరు చెయ్యలేదు. అయితే వితంతువులకు కూటమి ప్రభుత్వంతాజగా నేడు, శుక్రవారం శుభవార్త అందించింది. జూన్ 12 నుంచి వీరికి కొత్త పెన్షన్లను జారీ చేయనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త వితంతు పెన్షన్ల మంజూరుకు మంత్రి అచ్చెన్నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వితంతువులకు ప్రతి నెలా రూ. 4 వేలు నేరుగా అకౌంట్లోకి రానున్నాయి. జూన్ 12 నుండి కొత్త పింఛన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రూపాయి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
