సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి , టిడిపి రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి ఆధ్వర్యంలో నేడు, శుక్రవారం ఉదయం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 24 మంది లబ్ధిదారులకు 14 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం నియోజకవర్గ ప్రజల నుండి అర్జీ వినతి పత్రాలు స్వీకరించి మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమి చంద్రబాబు ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తూ వారు చేయించుకున్న శాస్త్ర చికిత్సలకు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని తెలిపారు. కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలోనే పెన్షన్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్ పామర్తి వెంకటరామయ్య ఎండి షబీనా భీమవరం పట్టణ టిడిపి అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము చెల్లబోయిన గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
