సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు వెలువడినాక .. కేవలం 10 రోజుల వ్యవధిలో విడతల వారీగా ముచ్చటగా మూడోసారి నేడు, శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై భారం మరింత పెరిగింది. తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచినట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు ఈరోజు(శనివారం) ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో ఉత్తరాది రాష్ట్రాలలో పెట్రోలు లీటర్ ఇప్పటికి 100 రూపాయలు లోపే ఉండగా దక్షిణాది లోని తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.84కు చేరుకోగా, డీజిల్ ధర రూ.100.94గా నమోదైంది. ఏపీలో పెట్రోలు లీటర్ కు 115 రూపాయలకు చేరింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల,కూరగాయలు ధరలు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇంధన ధరల పెరుగుదల మరింత ఆందోళన కలిగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *