సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రాగానే అక్కడ అక్రమంగా నివాసం ఉంటున్న వేలాది బంగ్లాదేశ్ వాసులు తిరిగి తమ దేశానికీ తరలి వెళ్లారు. అయితే ఇంకా అక్కడే మొండిగా తిష్టవేసిన బంగ్లాదేశ్ అక్రమవలసదారులను సీఎం సువేందు అధికారి(Suvendu Adhikari)తాజగా హెచ్చరించారు. ”ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకముందే పారిపోండి’ అంటూ బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల పై మాట్లాడుతూ, కొత్త చట్టంతో కాకుండా ప్రస్తుతం ఉన్న విదేశీయుల చట్టం కిందే ఈ చర్యలు తీసుకుంటామని తమ పౌరులను వెనక్కి తీసుకునే బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వంపైనే ఉందన్నారు. ‘వారికి మనమెందుకు ఆతిథ్యం ఇవ్వాలి చొరబాటుదారులు ఏమైనా మన అల్లుళ్లా?’ అని ప్రశ్నించారు. దీనితో పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హకింపూర్ సరిహద్దు వద్ద నేడు మంగళవారం ఉదయం వేలాదిగా పెద్దఎత్తున వారు గుంపులుగా సరిహద్దులు దాటిన సన్నివేశాలు కనపడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *