సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎట్టకేలకు డీకే శివకుమార్ తన పట్టు సాధించారు. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది.. మే 30వ తేదీ శనివారంనాడు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల తాజా సమాచారం.రాహుల్ గాంధీ నుంచి నేరుగా ఈ సందేశం రావడంతో సిద్ధరామయ్య సైతం పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు. డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా కొత్త మంత్రివర్గంలో ముగ్గురు ఉపముఖ్యమంత్రులకు చోటు కల్పిస్తారని తెలుస్తోంది. వీరిలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఒకరు, ఓబీసీ వర్గానికి చెందిన మరొకరితో పాటు ఒక మహిళ ఉంటారు.తాజా సమాచారం ప్రకారం, ఈనెల 28న అపాయింట్‌మెంట్ ఇవ్వాలని గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్‌ను సిద్ధరామయ్య కోరారు. అదేరోజు తన రాజీనామా పత్రాన్ని అందజేసి, తన డిప్యూటీ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం చేస్తారు.
