సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘ పరిధిలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ ముందస్తు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.తో జిల్లా కలెక్టర్ శ్రీమతి సి. నాగరాణి గారి ఆదేశాల మేరకు, భీమవరం పురపాలక సంఘ కమిషనర్ కె. రామచంద్ర రెడ్డి విజ్ఞప్తి ఏమనగా — పురపాలక సంఘ పరిధిలో బహిరంగ ప్రదేశాలలో అనధికారికంగా జంతువులను వధించడాన్ని పూర్తిగా నిషేధించడమైనది. ముఖ్యంగా గోవులు, దూడలు, గర్భంతో ఉన్న పశువులు మరియు అనారోగ్యంతో ఉన్న ఇతర జంతువులను వధించడం చట్టరీత్యా నేరమని తెలియజేయడమైనది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎవరైనా అనధికారికంగా జంతువధకు పాల్పడినట్లు సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లేదా ప్రజల నుండి ఫిర్యాదులు అందినట్లయితే, అట్టి వారిపై “జంతు హింస నిరోధక చట్టం – 1960”లోని సెక్షన్ 11 ప్రకారం అపరాధ రుసుముతో పాటు జైలు శిక్ష కూడా విధించబడునని హెచ్చరించడమైనది. చట్టం అమలు చేయుటకు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడమైనది. ఈ సమాచారాన్ని అన్ని మసీదుల నిర్వాహకులకు, ముస్లిం మత పెద్దలకు తెలియజేయడం జరిగిందని, అందరూ సహకరించవలసిందిగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *