సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో..అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం వెండి ధరలు పడిపోవడం, డాలర్ బలపడటంతో భారత మార్కెట్‌లో వాటి ధరలు దిగివచ్చాయి. నేడు, గురువారం ఉదయంసమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,56,060గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా రూ.2,230 మేర తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,050గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.2,050 మేర తగ్గింది (Gold Rate).మరోవైపు వెండి (silver) ధరలు కిలోకు పదివేల రూపాయల మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,85,000గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో , బెంగళూరులో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,75,000గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *