సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో మండు వేసవిలో భానుడు ప్రచండం మధ్య గోదావరి జిల్లాలలో గాలివానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే ఈ వేసవి సీజన్ లో తొలిసారి మొన్న రాత్రి నుండి తెల్లవారు జాము వరకు భీమవరంలో ఉరుములు మెరుపులు మధ్య వర్షం కురవడంతో విద్యుత్తూ సరఫరా కూడా నిలచిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పలుచోటల భారీ గాలులకు పెద్దఎత్తున చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి రైతులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఈ మేరకు ప్రతిరోజూ వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. .తాజాగా నేడు (గురువారం) ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న మూడు గంటల్లో కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.
