సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ ప్రయోజనాలే శ్వాసగా పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన అద్భుత పాలనతో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆశయాన్ని నిజం చేసి చూపించారని ఆయన కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో భీమవరంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ శిక్షణా తరగతులు నేడు, శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు కార్యక్రమంలో బీజేపీ ఘనమైన చరిత్ర, కమల వికాసం, జిల్లాకు చెందిన ముఖ్య నేతలు చేపట్టిన వివిధ సేవా, రాజకీయ కార్యక్రమాలతో కూడిన ప్రత్యేక ఫొటో ఎగ్జిబిషన్ స్టాల్ ప్రదర్శన కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకుంది. తదుపరి రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ కూడా సభకు హాజరు కావడం జరిగింది. కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. బీజేపీ లో ఎంతటి సీనియర్ నాయకుడైనప్పటికీ నిరంతర అభ్యాసం, ప్రశిక్షణ అనేది పార్టీలో అత్యంత ఆవశ్యకమని, అందువల్లే ఒక సామాన్య బూత్ స్థాయి కార్యకర్త సైతం జాతీయ స్థాయి అత్యున్నత నేతగా ఎదిగే రాజకీయ స్వేచ్ఛ ఒక్క బీజేపీలోనే సాధ్యమవుతుందని అన్నారు. రెండు రోజుల పాటు జరిగే వివిధ కాలాంశాలలో దేశ, విదేశీ పరిణామాలు, పార్టీ సిద్ధాంతాలపై జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్య వక్తల ద్వారా విస్తృత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. లించి పాల్గొన్నారు.
