సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన తెలంగాణలో జరుగుతున్న ఆందోళనల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని, పొరుగు రాష్ట్రానికి చెందిన కొందరు చేస్తున్న హెచ్చరికలకు ఇక్కడ ఎవరూ భయపడే ప్రసక్తే లేదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ స్పష్టం చేశారు. నేడు, శనివారం భీమవరం విచ్చేసిన ఆయన నేడు, శనివారం స్థానిక మీడియాతో మాట్లాడారు. ప్రొఫెసర్ నాగేశ్వర రావు ఫై ఏపీలో కేసు లు పెట్టినందుకు . డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కొందరు తెలంగాణ వాదుల, కాంగ్రెస్ ఎమ్మెల్యే ల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తు.. ​భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో NDA కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల నేతృత్వంలోని కూటమికి నష్టం కలిగించాలనే పక్కా ప్రణాళికతోనే తెలంగాణ వేదికగా కొందరు ఈ కుట్రలను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరగొచ్చని.. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ను తిరగనివ్వం, నివాసం ఉండనివ్వం, తెలంగాణ పర్యటనలను అడ్డుకుంటామంటూ హెచ్చరికలు చేయడం తగదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అక్కడి నేతలు కూడా ఈ తరహా పరిణామాలపై పునరాలోచించుకోవాలని, లేనిపక్షంలో ఇవి వారికే తీవ్ర నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు.( ఇదిలా ఉండగా నిజానికి తెలంగాణాలో బీజేపీ కీలక నేతలుతో పాటు ఏ పార్టీ కూడా పవన్ కు మద్దతుగా మాట్లాడకపోవడం గమనార్హం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *