సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంచితనం .. నిండైన మానవత్వం .. ఎమ్మెల్యే అంజిబాబు సొంతమని, ఆప్యాయంగా పలరించడం అయన నైజమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పుట్టినరోజు వేడుకలను భీమవరం శ్రీ కృష్ణదేవరాయ కళ్యాణ మండలంలో నేడు,శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు నిర్వహించారు. జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, కార్యకర్తలు, తరలివచ్చి ఎమ్మెల్యే అంజిబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. గజమాలతో ఎమ్మెల్యే అంజిబాబు ను సత్కరించారు. మధ్యాహ్నం వచ్చిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ.. ప్రజలతో కలిసి నడిచే వ్యక్తి, పేద ప్రజల అభ్యున్నతే ఎమ్మెల్యే అంజిబాబు ధ్యేయమని అన్నారు. రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరరావు మాట్లాడుతూ ప్రజలకోసం ఆలోచిస్తూ ప్రజలమెచ్చిన నాయకుడు ఎమ్మెల్యే అంజిబాబు అని అన్నారు. మన ‘సిగ్మా న్యూస్’ కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తు,. ఆయనతో 2న్నర దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం గుర్తు తెచ్చుకోవడం జరిగింది. నేటి మధ్యాహ్నం పట్టణంలో వృద్దుల ఆశ్రమంలోని పలు స్వచ్చంద కేంద్రాలకు వెళ్లి ఎమ్మెల్యే అంజిబాబు వారి మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *