సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం కు 11 కిమీ దూరంలో కాళ్ళకూరు గ్రామంలో 460 ఏళ్ళ క్రితం స్వయం భువుడు గా వెలసిన మహిమగల.. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము నందు జరుగుచున్న అభివృద్ధి పనులలో భాగంగా దేవాలయం చుట్టూ మాడవీధులు విస్తరణలో భాగంగా స్థలం కొనుగోలు నిమిత్తం, నేడు, శనివారం కలవపూడి వాస్తవ్యులు పెన్మత్స దుర్గ ప్రసాదు రాజు, శ్రీదేవి దంపతులు, వేగేశ్న హేమంత్ సూర్యనారాయణ రాజు, జోతిర్మయ దంపతులు, దాట్ల కృష్ణ రోహిత్, చామంతి కిర్మణయ దంపతులు రూ. 2,11,116/- ( అక్షరాల రెండు లక్షల పదకొండు వేల నూట పదకొండు రుపాయులు ) నగదును .. దేవస్థానం కార్యనిర్వహణాధికారి అరుణ్ కుమార్, మరియు పాలకమండలి అధ్యక్షులు అడ్డాల.శివరామరాజు మరియు పాలకమండలి సభ్యులు గ్రామ పెద్దల సమక్షమున అందజేయడం జరిగినది. దాతలను అభినందించి వారికి స్వామి వారి శేష వస్త్రం ప్రసాదములు, వేద ఆశీర్వచనం అందజేయడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *