సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ తో సహా ఆర్ధిక ద్రవ్యోల్భణం పెరిగిపోతున్న ప్రపంచ దేశాలు గల్ఫ్ యుద్ధం ఎప్పుడు ముగిసి హర్ముజ్ జలసంధి తీర్చుకోవాలని ఎంతగా ఎదురుచూసిన అది సాధ్యం కావడం లేదు. ఒక ప్రక్క సుదీర్ఘ చర్చలు జరుగుతుండగానే అమెరికా ఇరాన్ ల మధ్య దాడి ప్రతిదాడులు జరుగునో నేపథ్యంలో ,,నేటి ఆదివారం తెల్లవారు జాము అమెరికాకు చెందిన US MQ-1 డ్రోన్‌ను కూల్చేశామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. ఇరాన్ ఎయిర్ స్పేస్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌ను ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ ధ్వంసం చేశాయని తెలిపింది. దాన్ని భద్రతా దళాలు అధునాతనమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఉపయోగించి పేల్చేశాయి. ఆ డ్రోన్ దాడులు చేసే ఉద్దేశ్యంతోనే ఆ డ్రోన్ ఇరాన్ భూభాగంలోకి వచ్చిందని అన్నారు. ఇదిలా ఉండగా హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా కొనసాగిస్తున్న దిబ్బంధనాన్ని త్వరలోనే ఎత్తివేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
