సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రొపెసర్ నాగేశ్వర రావు అరెస్ట్ కు ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోందని ఏపీలో కూటమి ప్రభుత్వం నియంతృత్వాన్ని అడ్డుకోవాలని తెలంగాణ మేధావులు ఆగ్రహం పవన్ కళ్యాణ్ ఫై చేసిన ‘పరమ దారుణ బాషా ప్రయోగలు’ . కోడి చెరువు . కబ్జా కోరుగా పవన్ ఫై చేసిన ఆరోపణలు, దానికి అధికార కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు మద్దతుగా మాట్లాడటం తదుపరి నేడు, మంగళవారం తెలంగాణ లో జనసేన సభ కు పవన్ పిలుపు నివ్వడం ఉద్రిక్తలు రేకెత్తిస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాల లో రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వకపోవడంతో పవన్ ఒంటరి పోరాటం చేస్తున్నట్లు కనపడుతుంది. దానికి తోడు తెలంగాణలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన సభ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అయితే, ఊహించని మలుపుగా ఈ సభకు రేవంత్ రెడ్డి ఆద్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పవన్ ఫై దాడి కి తెలంగాణ సంఘాలు సిద్ధంగా ఉన్నట్లు భావిస్తూ భద్రతా కారణాలను అడ్డుపెట్టుకుని సైబరాబాద్ పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.( సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి కేవిట్ దాఖలు చెయ్యడంతో..)పోలీసుల నిర్ణయానికి వ్యతిరేకంగా జనసేన తరఫున దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీనిపై పవన్ స్వాందన కోసం జన సైనికులు ఎదురు చుస్తున్నారు. ఏపీలో ఏ అభివృద్ధి చెయ్యలేక తిరుమల లడ్డు ప్రసాదం నుండి కులాల మధ్య, మతాల మధ్య గొడవలకు పవన్ ముఖ్యకారణం అని ఆరోపిస్తూ ఆ వేషాలు తెలంగాణ లో వద్దని సోషల్ మీడియాలో తెలంగాణ వాదులు హెచ్చరికలుతో పెద్ద ఎత్తున Reels వైరల్ చేస్తున్నారు.
