సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైకోర్టు కూడా జనసేన విజ్ఞప్తి తిరస్కరించడంతో హైదరాబాద్ లో జనసేన సభ రద్దు కావడం, పవన్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండటంతో జనసేన జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్ కొణిదెల నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణాలో అధికారులు రాజకీయ పార్టీలు , ఏపీలో ప్రతిపక్షాలు కలిసి పవన్ కల్యాణ్‌ను ఎంత అణిచివేయాలని చూసినా.. ప్రతిసారీ ఆయన మహా విజయాన్ని సాధిస్తూనే ఉంటారు. అదృష్టం అనేది అందరినీ వరించదు. నిరంతరం శ్రమించి, అపజయాల ఎదుట ధైర్యంగా లేచి నిలబడాలి. అలాంటి అసాధారణమైన విజయమే ఒక చరిత్ర అవుతుంది. పవన్ కల్యాణ్ సరిగ్గా అలాంటి చరిత్రనే సృష్టిస్తారు. సినిమా స్టైల్లో చెప్పాలంటే.. ఆయన రావడం కొంచెం లేట్ అవ్వొచ్చు, కానీ రావడం మాత్రం పక్కా! త్వరలోనే తెలంగాణ గడ్డపై భారీ సభ పెట్టి తీరుతాం అని నాగాబాబు కామెంట్స్ చేశారు, పవన్‌పై బురదజల్లుతున్న విమర్శకులకు, అధికారులకు,మంత్రులకు నాయకులకు త్వరలోనే గట్టిగా బదులిస్తామని, అప్పుడు అందరూ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని నాగబాబు హెచ్చరించారు.
