సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు ఊహించని కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన అమరావతి రైతులు ఉద్యమించిన అమరావతి ప్రాంతంలోని రైతు సంఘంలోని కీలక నేతలు నేడు, మంగళవారం .వైసీపీ అధినేత వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసి కూటమి ప్రభుత్వం తమను ఇంకా భూములు కావాలని వేధిస్తోందని ఇచ్చిన భూములకు తమకు ఇస్తామన్న ఫ్లాట్స్ కు స్ఠలాలు ఎక్కడ ఉన్నాయో ఎప్పుడు ఇస్తారో ఇప్పటి వరకు దిక్కులేదని, ఇటీవల మరి కొన్నివేల ఎకరాల భూములు కావాలని అమ్మని రైతులను బెదిరిస్తున్నారని వాపోయారు. ఆఖరికి దేవాలయ భూములను కూడా కాపాడుకోలేకపోతున్నామని తమకు తోడుగా ఉండాలంటూ జగన్ను కోరారు. అలాగే తమ సమస్యలపై గళం ప్రభుత్వానికి వినిపించాలని జగన్ను కోరారు. ఈ నేపథ్యంలో అమరావతి రైతులకు ధైర్యం చెప్పిన జగన్.. అమరావతి పేరుతొ వేల కోట్ల అవినీతి జరుగుతున్నదని, అవసరం లేకపోయిన, కొత్త విమాన ఎయిర్ పోర్ట్, కొత్త రైల్వే స్టేషన్ అంటూ మరిన్ని పంట భూములు బెదిరించి లాగేసుకొంటున్నారని, రైతులకు తాము అండగా ఉంటామని అమరావతి రైతులను కాపాడాలనే ఉద్దేశ్యంతోనే తాను ‘మావిగన్’ ను ప్రతిపాదించానని అన్నారు.
