సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుప్రీంకోర్టు ప్రభుత్వ ఉద్యోగాలలో, ప్రభుత్వ డీలర్ షిప్ లలో కారుణ్య నియామకాలు ఫై సుప్రీం కోర్ట్ తాజగా సంచలన తీర్పు చెప్పింది. పెళ్లయినంత మాత్రాన కుమార్తె పరాయి మనిషి కాబోదని, కారుణ్య నియామకానికి ఆమెకు కూడా అర్హత ఉంటుందని.. అర్హత లేదని అంటే అది రాజ్యాంగ విరుద్ధమవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుల్సుమ్ నిషా అనే మహిళ వివాహం అయినప్పటికీ తన పుట్టింటిలో ఉంటూ తల్లితో కలిసి రేషన్‌షాపును నిర్వహించేవారు. శారీరక వికలాంగురాలైన తన సోదరి బాధ్యతలను సైతం చూసుకునేవారు. కొంతకాలానికి ఆమె తల్లి మరణించారు. తల్లి పేరిట ఉన్న రేషన్ షాప్ లైసెన్స్‌ను కారుణ్య ప్రాతిపదికన తనకు కేటాయించాలని కుల్సుమ్ ప్రభుత్వానికి అప్లై చేసుకున్నారు. కానీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2019లో తెచ్చిన జీవో ప్రకారం వివాహమైన కుమార్తెలకు చోటు లేదంటూ అధికారులు ఆమె దరఖాస్తును తిరస్కరించారు. దీనిపై ఆమె న్యాయపోరాటం ప్రారంభించారు. ‘కుమార్తెకు కారుణ్య నియామకాన్ని నిరాకరించడానికి వివాహం అనేది అడ్డంకి కాబోదు’ అని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. ఆమె కారుణ్య నియామకానికి అర్హురాలె అని తీర్పు చెప్పింది.
