సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ తెలంగాణ ఎమ్మెల్సీ, ప్రొపెసర్ నాగేశ్వర రావు తన విశ్లేషణలో చేసిన పదాలను వెనక్కి తీసుకొన్నపటికి ఏపీలోని పాలకులు అతనిపై కేసులు పెట్టి ఆ ప్రపంచ స్థాయి మేధావిని తీవ్రంగా బెదిరిస్తూ అవమానిస్తూ ఏపీలో పోలీసులు తో అరెస్ట్ చేసి జైలులో పెట్టాలని చూస్తున్నారని, భావిస్తు సీనియర్ తెలంగాణ వాదులు తీవ్ర నిరసనలు విమర్శలు చేసారు. ఒకవేళ ప్రొపెసర్ నాగేశ్వర రావు ను అరెస్ట్ చేస్తే హైద్రాబాద్‌లో నివాసం ఉంటున్న ఏపీ పాలకుల నివాసాలు ముట్టడించాలని నిర్ణయించారు. దీనితో ‘మరో అగ్గి’ రాజుకొంది.. తెలంగాణ కీలక మంత్రులు, ఆఖరికి ప్రతిపక్ష నేత కేటీఆర్ తో సహా పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఆయన హాద్దులలో ఉండకపోతే.. అని తీవ్ర హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో, ఇక ఈ వివాదానికి స్వస్తి చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబు నేడు, బుధవారం స్వాందించారు తాజగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని రాష్ట్రాలు వేరైనా తెలుగువారంతా ఒక్కటేనని, అనవసర వివాదాలతో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించడం సరికాదని ఏపీ సీఎం నారా చంద్రబాబు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో నైనా రాజకీయం చేసే హక్కు ఉంటుందని చంద్రబాబు గుర్తుచేశారు. గతంలో నేను తమిళనాడు వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కూడా ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్లారు. బీఆర్ఎస్ (BRS) పార్టీ తాము జాతీయ పార్టీ అని ప్రకటించుకుంది కదా..కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు తెలంగాణలో మాట్లాడుతున్న మాటలు ఎంతమాత్రం కరెక్ట్ కాదు. రెండు రాష్ట్రాలుగా విడిపోయి 12 ఏళ్లు అవుతోంది. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడెందుకు మళ్లీ ఇవన్నీ సృష్టిస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ.. తెలుగువారిగా అంతా కలిసికట్టుగా ఉండాలి. రెండు రాష్ట్రాలనూ ప్రగతి పథంలో నడిపించుకోవడమే అందరి లక్ష్యం కావాలి’ అని అన్నారు.
