సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి నేటి గురువారం తో 2ఏళ్ళు పూర్తీ అయిన నేపథ్యంలో ఈరోజు సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు. దానిలో .. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జూన్ 4, 2024 చిరస్థాయిగా నిలిచిపోయే రోజు అని ,విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చరిత్రాత్మక దినానికి నేటికి రెండేళ్లని పేర్కొన్నారు. ఆ విజయం తమకు అధికారం కాదని… రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత అని ఉద్ఘాటించారు. ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని,. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గ సంక్షేమం కోసం తాము పనిచేస్తున్నామని, అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
