సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎట్టకేలకు రాంచరణ్ హీరోగా భారీ అంచనాలతో మైత్రి మూవీ మేకర్స్, వారి సుకుమార్ రచన సహకారంతో అయన శిష్యుడు బుచ్చిబాబు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. RRR తరువాత వరుస పరాజయాలతో ఉన్న రాంచరణ్ ను గట్టెక్కిస్తుందని భావిస్తున్న “పెద్ది’ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..కథ విషయానికి వస్తే .. ఉత్తరాంద్ర లోని విజయనగరానికి కూత వేటు దూరంలో ఉన్నా కూడా కొండ కింద ఊరు కావడంతోఅక్కడ ప్రజలకు సరైన గుర్తింపు ఉండదు.. ఆ ఊరిలో కుర్రాడు పెద్ది (రామ్ చరణ్), తండ్రి అప్పలసూరి (జగపతిబాబు). ఆ ఊరికి కనీసం గుర్తింపు తీసుకురావాలని, ఊళ్లో రైలు ఆగితే తమ బతుకులు బాగుపడతాయని 30 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉంటాడు. అప్పలసూరి కొడుకు పెద్దితో కలసి మరోవైపు కొండ కింది నుంచి విజయనగరము టౌన్ కి వచ్చి పనిచేసుకొని బతుకుతూ ఉంటారు పెద్ది ఊరు జనం. పెద్ది క్రికెట్ బాగా ఆడతాడు అని తెలిసి అతన్ని వేలంపాటలో కొనుక్కుంటూ ఆ ఊరి జనం మ్యాచ్ లాడుతుంటారు. ఇక అదే ఊర్లో ఉండే ఒక పొలిటికల్ లీడర్ కూతురు అచ్చియమ్మా (జాన్వీ కపూర్)ను చూసి ప్రేమలో పడిపోతాడు పెద్ది. అదే సమయంలో క్రికెట్ వదిలేసి కుస్తీ వైపు అడుగులు వేస్తాడు.. అక్కడి నుంచి రన్నింగ్ వైపు వస్తాడు. కొండ కింది ఊరు నుంచి ఢిల్లీ వరకు పెద్ది ప్రయాణం సాగుతుంది. ఇదంతా ఊరి గుర్తింపు అభివృద్ధి కోసం.. పెద్ది ఎంతకు తెగించాడు అనేది అసలు కథ.. ఇక సినిమా విశేషణకు వస్తే.. బుచ్చిబాబు సినిమా తీయలేదు.. ఓ అద్భుతమైన ఎమోషనల్ కథ చెప్పాడు. ఇందులో ఎత్తులే ఉన్నాయని చెప్పలేము.. పల్లాలు కూడా ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు 40 నిముషాలు సినిమాలోకి ప్రేక్షకులు వెళ్ళిపోతారు. అంత ఫీల్ ఉంటుంది. పెద్దిని చివర్లో క్లైమాక్స్‌కు వచ్చేసరికి పై ఎత్తులో కూర్చోబెట్టాడు బుచ్చిబాబు. తీసుకున్న కథ పాతదే. క్రికెట్ సీన్స్ అన్నీ బాగానే వర్కవుట్ అయ్యాయి. హీరోయిన్ జాన్వీ తో రొమాన్సు ‘లిప్ టు లిప్ కిస్\ లు పెట్టిన పెద్దగా పండలేదు.. మధ్యలో కొన్ని ల్యాగ్ సీన్స్ఉన్నాయి. సినిమా అంతా రామ్ చరణ్ మరల రంగస్థలం గుర్తుకు తెచ్చే పాత్రలో నటించాడు. అత్యంత కీలకమైన పాత్ర పోషించింది జగపతిబాబు అప్పలసూరి.. సరికొత్త గెట్అప్ పాత్రలో జీవించాడు. అలాగే శివరాజ్ కుమార్ పోషించిన గౌర్నాయుడు బాగుంది. రామ్ చరణ్ కి ఈ రెండు పాత్రలతో ఉన్న సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఇక తెరవెనక నడిపించిన హీరో AR రెహ్మాన్ చాల కాలం తరువాత రీ రికార్డింగ్ చక్కటి సంగీతం అందించారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకు హైప్ అయ్యింది. ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే థియేటర్లో నుంచి ప్రేక్షకులను బయటికి పంపించాడు .
