సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నేడు, గురువారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైంది. కేంద్రం నుండి ఏపీ పంచాయతీ రాజ్ శాఖకు పలు అవార్డులు రావడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అభినందించారు. నేటి సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం.. మంత్రులతో చర్చిస్తున్నారు..ఇంతలో అకస్మాత్తుగా పవన్ కల్యాణ్‌కి (Pawan Kalyan) వెన్నునొప్పి తీవ్రంగా ఉండటంతో ఆయన సీఎంకి, మంత్రివర్గ సభ్యులకు సమాచారం ఇచ్చి మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. అనంతరం ఆయన మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కాగా,నేటి కాబినెట్ మీటింగ్లో.. హైకోర్టు భవనాల దగ్గర మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. సీఆర్డీఏ బిల్డింగ్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనుంది. 9 జిల్లాల పరిధిలో అమరావతి ఎకనామిక్ రీజియన్‌ RFCకి ఆమోదించనుంది… అమరావతిలో పర్యాటకానికి ప్రోత్సాహంగా జెయింట్ అబ్జర్వేషన్ వీల్‌ను నిర్మించేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. తల్లికి వందనం పథకానికి నిధుల విడుదలపై మంత్రి మండలి చర్చిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *