సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:చంద్రబాబు సీఎంగా ఏపీలో కూటమి పాలన అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తీ అయిన నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ నేడు, గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ;వెన్నుపోటు దినం‘ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో భీమవరం నియోజక వైసీపీ పార్టీ ఇంచార్జి చినమిల్లి వెంకట రాయుడు ఆధ్వర్యంలో భీమవరం పట్టణ విధుల మీదుగా వైసీపీ శ్రేణులు సీఎం చంద్రబాబు వెన్నుపోటు ప్లై కార్డ్స్ చేతబూని రోడ్లపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నేతలు మాట్లాడుతూ.. 2 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎన్నో కష్టాలు ఎదురుకొంటున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని నిత్యావసర వస్తువుల ధరలు అడ్డు అదుపు పెరిగిపోయాయని, అమరావతి రాజధాని పేరుతొ రాష్ట్రాన్ని అప్ప్పుల పాలు చేసి దొరికినకాడికి వేల కోట్లు దోచేస్తున్నారని, అక్కడి రైతులకు వెన్నుపోటు పొడిచారని, రాష్ట్రంలో ప్రజా సంక్షేమం లేదని సూపర్ సిక్స్ అని ప్రజలను మాయ చేసి జగన్ హయాంలో ఉన్న అన్ని సంక్షేమ పథకాలు కూడా తీసిపారేశారని, ఆరోగ్యశ్రీ ని పాడుచేసారని, విద్య వైద్యం సామాన్య ప్రజలకు దూరం చేసి ప్రజలను వెన్ను పోటు పొడిచారని, ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై దాడులు చేయించడం,అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చెయ్యడం రొటీన్ గా జరిగి పోతుందని ఆరోపణలు చేసారు. వైద్య కలశాలలు ప్రేవేటీకరణ, డీఎస్సీ పరీక్షలు పోస్టులు అన్ని అవినీతిమయం చేసారనిఇకెంతో కాలం ఈ నియంతృత్వ పాలన కొనసాగదని జగన్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలు కు వాస్తవాలు బాగా అర్ధం అయ్యాయని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు.
