సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా అంతర్జాతీయ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్‌యూ-57 యుద్ధ విమానాన్ని భారత్‌తో కలిసి సయుక్తంగా తయారు చేసేందుకు రష్యా సిద్ధమేనని అన్నారు. గతంలోనే ఈ విమానాన్ని సంయుక్తంగా అభివృద్ధి చేద్దామని మేము ప్రతిపాదించాము. కానీ ఈ ప్రాజెక్టులో మేము తరువాత చేరుతామని భారత్ చెప్పింది. మేము ఇప్పుడు దీన్ని సొంతంగానే నిర్మించుకున్నాము. అయితే, భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగానే ఉన్నాము’ అని పుతిన్ చెప్పారు. ఈ ఫైటర్ జెట్‌కు సంబంధించి కీలక సాంకేతిక పరిజ్ఙానం కూడా భారత్‌కు బదిలీ చేస్తామని పేర్కొన్నారు. గత గురువారం అంతర్జాతీయ మీడియాతో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా తయారు చేసిన ఐదవ తరం యుద్ధ విమానం జే-35ఏఈని పాక్ కొనుగోలు ఒప్పందం వార్తలు నేపథ్యంలో భారత్ కు భరోసా ఇస్తూ పుతిన్ ఆఫర్‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *