సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ రాజకీయాల్లో జనసేన పోటీపై తెలంగాణ లో గర్జించిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాత్రం తెలంగాణలో పోటీపై తమకు ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేవని స్పష్టం చేశారు. నేను ఎప్పుడూ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చెడుగా మాట్లాడలేదు. తెలంగాణ ముమ్మాటికీ ఆ ప్రాంత భూమిపుత్రులదే. జనసేనలో ఉన్న తెలంగాణ ప్రాంత భూమిపుత్రులే అక్కడ పోటీ చేస్తామంటున్నారు. మా తెలంగాణ నేతలు గట్టిగా పోరుపెడితేనే నేను అక్కడికి వెళ్లాను అని పవన్ వివరించారు.రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు దాటిపోయింది. అయినా సరే ఇప్పటికీ కొందరిలో అంత ద్వేషం ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. ప్రాంతీయవాదం వేరు.. ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడం వేరు. కానీ ఇలా మనుషులను విభజించుకుంటూ వెళ్తే చివరికి ఎక్కడికి వెళ్తాం? అని ప్రశ్నించారు.2014 నుంచి 2024 వరకు.. ఈ పదేళ్ల కాలంలో ఎంతమంది తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి వ్యాపారాలు, పనులు చేసుకోలేదు? అని పవన్ ప్రశ్నించారుఈ వివాదం వెనుక కాంగ్రెస్ నేతల తీరును పవన్ తప్పుబట్టారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కేరళలోని వయనాడ్ వెళ్లి పోటీ చేయొచ్చు. కానీ, నా ఇల్లు ఉన్న తెలంగాణకు నేను వెళ్లకూడదా? అయితే, ఈ వివాదం అంతా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందని మాత్రం నేను అనుకోవడం లేదు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రొపెసర్ నాగేశ్వర విషయంలో రెచ్చగొట్టవద్దని.. పవన్ తెలంగాణ ని జాగీరు కాదని, మాటలను హద్దులలో ఉంచుకోవాలని హెచ్చరించిన.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు సోదరుడి లాంటివారని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు.
