సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం విశాఖలో సీ-ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్‌షాప్ ను సీఎం చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. భారతదేశంలో సముద్రపు ఆహారం (సీ-ఫుడ్) ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రతి ఏటా 197 లక్షల మెట్రిక్ టన్నుల సీ-ఫుడ్ ఏపీ నుంచి ఉత్పత్తి అవుతోందని పేర్కొన్నారు. కేంద్ర మత్స్యశాఖ ప్రాంతీయ కార్యాలయానికి అవసరమైన స్థలాన్ని 15 రోజుల్లో ఇస్తామని పేర్కొన్నారు ‘భారతదేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో ఏపీ వాటా 28 శాతంగా, రొయ్యల ఉత్పత్తిలో 66 శాతంగా ఉంది. దేశ సముద్రపు ఆహార ఎగుమతుల్లో ఏపీ నుంచే కేంద్రానికి దాదాపు 38 శాతం ఆదాయం వస్తోంది. సంవత్సరానికి రూ.28,000 కోట్లకు పైగా సీ-ఫుడ్ ఎగుమతులు ఏపీ నుంచే జరుగుతున్నాయి. ( దీనిలో సింహభాగం సుమారు 12వేల కోట్లు పైగా భీమవరం జోన్ నుండే ఎగుమతి జరుగుతుంది) ప్రపంచవ్యాప్తంగా జరిగే సీ-ఫుడ్ బిజినెస్‌లో భారత్ వాటా కేవలం 5 శాతం మాత్రమే. ఈ రంగంలో దేశానికి పెద్దఎత్తున అవకాశాలు ఉన్నాయిఅన్నారు. ఈ సందర్భంగా కాకినాడ పోర్టును ఆధునికీకరణ చేస్తామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రకటించడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
