సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి, బంగారు తల్లి గా తెలుగునాట ప్రసిద్ధి పొందిన శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం నిధికి పెన్నాడకి చెందిన సోము వీర వెంకట సత్యనారాయణ వెంకట దుర్గా నాగలక్ష్మి దంపతులు శ్రీ అమ్మవారికి సుమారు 1లక్ష వేయి నూట పదహారు రూపాయలు విలువ చేసే 6 గ్రాముల 650 మిల్లిల బంగారం కానుక గా అందజేశారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు . ఆలయ ధర్మ కర్తల మండలి సభ్యులు వారికీ ఫోటో ప్రసాదం అందజేశారు.
