సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశం మొత్తం ద్రుష్టి వారణాసి మీదే.. శ్రీరాముడు పాత్రలో తొలిసారి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న‘వారణాసి’. ఫాంటసీ సినిమా భారీ స్థాయిలో పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతుంది. ఈ గ్లోబ్ ట్రాటర్ లో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా స్టోరీ ఏంటనేది రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ రివీల్ చేసేశారు. శ్రీరామ చంద్రునికి కుంభకర్ణుడి కి సంబందించిన కధ వారి మధ్య అప్పుడు ఇప్పుడు జరిగే పోరు గా అభివర్ణించారు. సైన్స్ ఫిక్షన్ ట్రావెల్ టైమ్ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో . ఇందులో 40 నిమిషుల పాటు రామాయణం ఎపిసోడ్ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. త్రేతాయుగం నుంచి కలియుగం వరకు.. ఆఫ్రికా నుంచి అంటార్కిటికా ఖండాల వరకూ విస్తరించిన ఏదో సరికొత్త కథను చెప్పబోతున్నారని హింట్ ఇచ్చారు. రుద్ర పాత్రలో మహేష్ బాబు, కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, మందాకినిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *