సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నైరుతి రుతుపవనాల ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ప్రవేశించాయి. మరో 3 రోజులలో తెలుగు రాష్ట్రాలయిన ఏపీ, తెలంగాణలో కూడా ప్రవేశిస్తున్న నేపథ్యంలో రాగాల రెండు లేదా మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ సఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో రాయలసీమ తో పాటు కోస్తా తీరంలో పలు జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *