సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అమెరికా నుండి నేరుగా ఢిల్లీ వేదిక జంతర్ మంతర్ వద్దకి చేరుకున్నారు. నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై సోషల్ మీడియా వేదికగా ఉద్యమించి, ఈ ప్రత్యేక పార్టీని స్థాపించిన ఆయన, విదేశాల నుండి స్వదేశానికి రావడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అభిజీత్ దీప్కే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అడుగుపెట్టడంతో ఈ నిరసన ప్రదర్శన మరింత భారీ నిరసన ప్రదర్శనకు పార్టీ సన్నద్ధమైంది. నీట్ (NEET), సీబీఎస్‌ఈ (CBSE) తో పాటు CUET, SSC GD వంటి వివిధ జాతీయ స్థాయి పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు, అవకతవకల వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఈ పరీక్షల లీకేజీలపై విద్యార్థులు, నిరుద్యోగ యువత తరఫున గళమెత్తుతూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఢిల్లీలోని ప్రసిద్ధ నిరసన వేదిక జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనతో రాజధాని నగరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షల లీకేజీల వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) బలంగా డిమాండ్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *