సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ ను ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు జరుగుతున్నా ఎన్నికల నామినేషన్ పక్రియ నేపథ్యంలో జనసేన నుంచి లింగమనేని రమేశ్‌ పేరును ఖరారు చేయడం, ఆయన నామినేషన్‌ దాఖలుచేయడం పూర్తయింది.ఇక మిగిలిన 3స్థానాలకు టీడీపీ నుంచి ప్రముఖ పరిశ్రమిక వేత్త మాజీ ఎంపీ సానా సతీశ్‌, భాష్యం విద్య సంస్తల అధినేత రామకృష్ణ పేర్లను ఇప్పటికే ఖరారు చేసిన పార్టీ అధినేత చంద్రబాబు తాజాగా మూడో అభ్యర్థిగా చింతకాయల విజయ్‌ ( స్పీకర్ అయ్యన్న పాత్రుని కుమారుడు) పేరును ప్రకటించారు. దీంతో రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. విజయ్‌ పేరుతోపాటు సీనియర్‌ నేత వర్ల రామయ్య పేరును చివరివరకు పరిశీలించిన చంద్రాబాబు చివరకు విజయ్‌ వైపు మొగ్గారు. వీరు రేపు నామినేషన్ వేసే కార్యక్రమంలో పాల్గొంటారు.గతంలో మన సిగ్మా న్యూస్ ముందస్తుగా తెలియజేసినట్లే లింగమనేని, భాష్యం రామకృష్ణ, సాన సతీష్ లకు రాజ్య సభ స్థానాలు దక్కనున్నాయి. ఈ న్యూస్ ఐటెం కు సోషల్ మీడియాలో లక్షలాది యూస్ రావడం గమనార్హం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *