సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాంచరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో విడుదలయిన ‘పెద్ది’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి చిత్రంగా ప్రతిష్ట సాధించినప్పటికీ కలెక్షన్ విషయంలో కాస్త వెనుకంజలో ఉంది. ‘పాన్ ఇండియా’ సినిమాగా మొన్న రాత్రి విడుదలయిన ఈ సినిమా కలెక్షన్స్ నిన్న శుక్రవారం మొదటి రోజు కలపి 135 కోట్లు వసూళ్లు చేసిందని మైత్రి మూవీస్ ప్రకటించినప్పటికీ 2వ రోజు కలెక్షన్స్ నెమ్మదించాయి. రామ్ చరణ్ ను నటుడిగా మరో మెట్టు ఎక్కించినప్పటికీ సినిమా ముగింపు ..కాలు.. దారుణ విషాద భరితంగా ఉండటంతో డివైడ్ టాక్ వచ్చింది. పాటలకు మంచి జోష్ వచ్చిన సరే స్టార్ హీరోల సినిమాలకు విషాద ముగింపులు సినిమా విజయాన్ని ప్రభావితం చేస్తాయి. దానికి తోడు పైరసీ సినిమా నెట్ లో ఎలానూ మంచి క్వాలిటీతో అందుబాటులో ఉంది. పెద్ది తెలుగు నాట కలెక్షన్స్ బాగున్నప్పటికీ ఇతర బాషలలో ఇంకా కలెక్షన్స్ జోరు ప్రారంభం కాలేదు. మంచి సినిమాలు విజయం సాదించాలి అని కోరుకొందాం.. ఇక భీమవరంలో మొదటి రోజు బెనిఫిట్ షో లతో కలపి 61 లక్షలు వసూళ్లు సాధించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 3కోట్ల 25 లక్షల భారీ షేర్ సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *