సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో దేశంలో గృహ వినియోగ గ్యాస్ (ఎల్‌పీజీ) సుమారు 15 కేజీల సిలెండర్ ధర మరోసారి రూ.29 మేర పెరిగింది. నేటి ఆదివారం నుండి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఢిల్లీలోని ఒక సాధారణ కస్టమర్ ఒక సిలిండర్ కోసం రూ.942 కేటాయిస్తారని తెలిపారు. ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌పై వందల రూపాయాల భారం సామాన్యులకు భారం కాకుండా కేంద్రం కొంత భారం మోస్తోందని తెలిపారు.. కమర్షియల్ సిలిండర్ ధరలను మాత్రం నెలనెలా సవరిస్తునే ఉంటామని ప్రకటించారు.
