సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో నేడు ఆదివారం భానుడు తీవ్ర వడగాల్పులతో నిప్పులు కురిపించాడు. అయితే రాయల సీమలో నైరుతి రుతుపవనాలు ఆగమనం తో నేటి ఆదివారం సాయంత్రం నుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు (AP Rain Alert) కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షపాతం నమోదవుతోందని అధికారులు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర లోని విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రము అంతటా విస్తరించడానికి మరో 3 రోజులు పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *