సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో.. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీడియాతో జరిపిన ముఖాముఖీ లో ఆయన చేసిన వ్యాక్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ముఖ్యంగా ఏపీ కూటమి లో జనసేన, టీడీపీ పార్టీలకు పెద్ద షాక్ గా మారాయి. ముఖ్యంగా తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామంటూనే.. దీనితోపాటు ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై మాకో స్పష్టమైన క్లారిటీ ఉంది. అక్కడ మేము ఒంటరిగానే పోటీ చేస్తాం. రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకునే అవకాశం లేదని అమిత్ షా తేల్చి చెప్పారు.( దీని అర్థం.. ఏపీలో ఉన్న పొత్తులు కేవలం ఆ రాష్ట్రానికే పరిమితమా? లేక ఇకపై ఉండదా?) అయితే ఒకటి మాత్రం స్వష్టం తెలంగాణలో బీజేపీ ఏ పార్టీతోనూ (టీడీపీ, జనసేన) కలిసి నడవడానికి సిద్ధంగా లేదని చెప్పకనే చెప్పినట్లు కూడా భావించాలి. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారీగా పొత్తు పెట్టుకుంటున్నాయన్నా ,ప్రచారం ఖండించారు. కేవలం పొత్తుల గురించే కాకుండా.. నియోజకవర్గాల పునర్విభజన, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి జాతీయ అంశాలపై కూడా అమిత్ షా తమ వ్యూహాత్మక క్లారిటీని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *