సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం వైసీపీ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ విశాఖలో స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోరం లో మృతి చెందిన 9 మంది మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.వారి సమస్యలు విన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 5గురు బాధిత కుటుంబాలను కూడా పరామర్శించారు. తదుపరి మీడియా సమావేశంలో .. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ .ఇంటి యజమానులను కోల్పోయి .కష్టాలలో ఉన్న బాధిత కుటుంబాలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని కేవలం 25 లక్షల పరిహారంతో సరిపెట్టారని అది కూడా వారి బాధితులకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇచ్చే నష్టపరిహారమేనని, ఇక ప్రధాని నిది క్రింద 2 లక్షలు మత్రమే వారికీ అందుతుందని ఇక ప్రభుత్వం ఏమి ఇస్తుంది? ‘బోడి’ తమ వైసీపీ ప్రభుత్వం గతంలో ఇదే తరహా ఘటనలకు విశాఖలో 12 మంది చనిపోతే ఒకొక్క కుటుంబానికి 1 కోటిరూపాయలు చప్పున ఇచ్చామని, మీకు కూడా మా ప్రభుత్వం వచ్చాక నెల రోజులలో కోటి రూపాయలు చప్పున నష్టపరిహారం ఇస్తామని భరోసా ఇచ్చారు. మంత్రి లోకేష్ బాధిత కుటుంబాలను ఓదార్చడం పోయి అహంకారంతో వ్యవహరించాడని, వారి తరపున బాధలు చెప్పిన వ్యక్తులను మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు కదా? అని ప్రశ్నించాడంటే ? గత ఏడాది ఇక్కడే ఒక పర్మినెంట్ ఉద్యోగి ప్రమాదంలో మరణిస్తే ( వారి కుటుంబ సభ్యులను చూపిస్తూ) వారి ఫైల్ పోయిందని నష్టపరిహారం లేదు, వారి కుమారులకు ఇస్తానన్న ఉద్యోగం కూడా ఎగవేసారు అని ఆరోపించారు. వారికీ మానవత్వం లేదని తెలుస్తుందని విమర్శించారు. తమ హయాంలో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ని ప్రవేటుపరం కాకుండా అడ్డుకున్నామని నేను స్వయంగా ప్రధాని మోడీకి 2 సార్లు లేఖ రాసి అడ్డుకున్నానని, రాష్ట్ర అసెంబ్లీ తరపున తీర్మానం చేయించానని ఆధారాలు మీడియాకు ప్రదర్శించారు జగన్. చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే తీరున అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేసారు..
