సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ప్రత్యేక స్థానం సంపాదించిన స్టైలిష్ టేకింగ్ సినిమాల్లో ‘OG’ ఒకటి. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రం పవన్ అభిమానులను అలరించింది..సినిమా విడుదలైనప్పుడే దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమాలకు కొంతకాలం విరామం ఇవ్వనున్నట్లు చెప్పడంతో ‘OG 2’ భవిష్యత్తుపై అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుందేమో అనే పరిస్థితుల్లో చిత్ర నిర్మాతలు తాజాగా తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ‘ఓజీ 2’ తప్పకుండా వస్తుందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా తాజగా ఓజి 2 ఫై చర్చలు జరుగుతున్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న దర్శకుడు సుజీత్ తిరిగి వచ్చిన తరువాత అధికార ప్రకటన వస్తుందన్నారు.
