సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అధినేత జగన్ గత గురువారం సాయంత్రం తాడేపల్లి లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల చంద్రబాబు సర్కార్ ప్రజలకు నిరుద్యోగులకు వైజాగ్ స్టీల్ కార్మికులకు తీవ్ర ద్రోహం చేస్తున్నారని ఆరోపిస్తూ దానికి తగిన ఆధారాలు ప్రజలు ముందు ఉంచే ప్రయత్నం చేసారు. జగన్ మాట్లాడుతూ.. ఒకఅబద్ధానికి, ఒక మోసానికి, ఒక వెన్ను పోటుకి, ఒక దగాకి, ఒక స్కామ్‌కి చొక్కా , ప్యాంటు గనక తగిలిస్తే కనిపించేది సీఎం చంద్రబాబేనని అన్నారు. ఆయన రాజకీయ జీవితం చూసినా, ఈ రెండేళ్లలో సూపర్ సిక్స్ , సూపర్ సెవెన్లు చూసినా, ఆ పార్టీ మేనిఫెస్టోలు లోతుగా చూసినా, ఆకరికి టీచర్లు రిక్రూట్మెంట్ చూసినా మనకు కనిపిం చేవి ఇవేన్నా రు. తమ హయాంలో అదికారంలోకి వచ్చిన 4నెలలలోనే సుమారు లక్షన్నర కొత్త ప్రభుత్వ ఉద్యోగులను చాల చక్కగా పారదర్శకంగా నియమించామని, తమ హయాంలో , డీఎస్సీ చక్కగా నిర్వహించి 6 వేల పోస్టులకు వైసీపీ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. అయితే వాటిని కూడా కూటమి ప్రబుత్వం తమ ఖాతాలో కలిపివేసుకొందని విమర్శించారు. నిరుద్యోగుల పోస్టులు కూడా 15 లక్షల చప్పున అమ్ముకున్న ఘనులు వీరేనన్నారు. స్పోర్ట్స్ కోటా లో గోల్డ్ మెడల్ సాధించిన ఆటగాడిని తన ప్రక్కనే చూపిస్తూ అతని పోస్టు కూడా అమ్మేసుకొన్నారని మొత్తం డీఎస్సీ పోస్టుల అమ్మకాలపై కేంద్ర సంస్థ CBI తో దర్యాప్తు చేయించాలని. ఇక్కడ రాష్ట్ర సంస్థలు దర్యాప్తులు అయితే చంద్రబాబు ఆయన సుపుత్రుడు లోకేష్ లకు అనుకూలంగా ఉంటాయని అందరికి తెలుసునని విమర్శించారు. రాష్ట్రంలో ఇన్ని మోసాలు చేస్తున్న పాలకులను ప్రశ్నించడానికి తాను సిద్ధమేనని, జన్ జీ ఆశయాలను నలిపేస్తే కోట్లాది కాక్రోచ్లు వస్తాయన్నారు. అందులో జగన్ కూడా ఒకరు కావచ్చని ఆఖరి పంచ్ వేశారు జగన్.
