సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి శనివారం ఉదయం భీమవరం పట్టణం 20వ సచివాలయ పరిధిలో ఎడ్వార్డ్ ట్యాంక్ పార్క్ వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మెంటే పార్థసారధి మాట్లాడుతూ.. మనిషి ఆరోగ్యానికి యోగ సాధన ఎంతో అవసరం అని భారత్ లోనే కాకుండా ప్రపంచం లో అందరు గుర్తించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారని, భీమవరం ప్రజలు కూడా యోగ సాధన తో ఆరోగ్యాలు కాపాడుకోవాలని పిలుపు ఇచ్చారు. స్థానికులు నేతలు కలసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మెంటే గోపి , మాస్టర్ యోగ ట్రైనర్ పాపోలు ఏడుకొండలు , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
