సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి శనివారం ఉదయం ఉండి నియోజకవర్గం, పాలకోడేరు మండలంలోని విస్సాకోడేరు, శృంగవృక్షం, పాలకోడేరు, మోగల్లు గ్రామాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో..ప్రైవేట్ విద్యా సంస్థలకు మించి ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేందుకు పునాదులు వేస్తున్నానని, ప్రభుత్వ నిధులతో కాకుండా తన మిత్రుల సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌లను శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..ప్రతి పాఠశాలలో 10 కంప్యూటర్లతో ఈ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం జరిగింది.. రాబోయే వారం రోజుల్లో ఇంకో 15 స్కూళ్లలో ప్రారంభిస్తాము. ఈ ల్యాబ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకుని, డిజిటల్ యుగానికి అవసరమైన నైపుణ్యాలను సొంతం చేసుకోవడానికి ఈ కంప్యూటర్ ల్యాబ్‌లు ఎంతో దోహద పడతాయని రఘురామకృష్ణ రాజు అన్నారు. అలాగే భీమవరంలో ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యంతో సమన్వయం చేసి, ఇక్కడ స్కూల్ విద్యార్థులకు ప్రత్యేక కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
