సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ప్రతిపక్ష నేత జగన్ ను అమరావతి రైతులు, డీఎస్సీ పరీక్షా రాసిన అభ్యర్థులు తమకు రక్షణగా నిలబడి తమ సమస్యలపై పోరాడాలని కోరిన ఘటనలు చూసాం. తాజగా నేడు, మంగళవారం తాడేపల్లి లోని, వై ఎస్ జగన్ నివాసము లోని కార్యాలయంలో ఆక్వా రైతులు సంఘం నేతలు ఆయనతో సమావేశం అయ్యి తమ సమస్యలు ఏకరువు పెట్టారు. దానికి ప్రతిగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆక్వా రైతులకు పెంచిన ఆక్వా ఫీడ్ ధరల్ని ఈ నెలాఖరు లోగా తగ్గించాలని.. లేకుంటే జులై 1, లేదా 2న ఆక్వా రైతుల తరుఫున తానే రంగంలోకి దిగి ఆక్వా రైతులకు మద్దతుగా పోరాడతానని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్ఛోక రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న రైతులు, ఆక్వా రైతులు దారుణమైన స్థితిలో ఉన్నారని.. తమ ప్రభుత్వ హయాంలో ఆక్వా రైతులకు తోడుగా 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబులు, 782 ఆర్బీ కేల్లో ఫిషరీస్, అసిస్టెంట్లను పెట్టాం. అప్సడా చట్టాన్ని తెచ్చాం. ముఖ్యమంత్రేనే అప్సడా ఛైర్మ న్ గా చేశాం . రైతులకు నష్టం రాకుండా సిండికేట్‌కు స్థానం లేకుండా చేశాం . 1రూపాయిన్న రకే యూనిట్ కరెంటు ను సబ్సిడీపై ఇచ్చాం . అలా ఆక్వా రైతుల కోసం 57 నెలల్లో రూ .3,306 కోట్లు విద్యు త్ సబ్సి డీ కింద చెల్లించాం . చంద్రబాబు హయాంలో 2018–19లో 38 లక్షల టన్నులు ఉన్న రొయ్య , మత్స్య ఉత్పత్తులు నా హయాంలో కరోనా వచ్చిన సరే.. 2022–23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులుకు పెరిగింది. 2021-22,2022-23లో రెండు సార్లు బెస్ట్ మెరైన్ అవార్డు లు వచ్చా యి. ఇప్పుడు ఆక్వా ఫీడ్, సీడ్, ప్రాససింగ్ యూనిట్లు అన్నీ చంద్రబాబు సాను భూతిపరులవే. సిండికేట్ లు పెట్టి రైతును అన్నివిధాలా దోచేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధిచెప్పాల్సిందే అని జగన్ వ్యాఖ్యానించారు.
.
