సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులను నేడు, బుధవారం ఉదయం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు దానిలో భాగంగా ప్రజలకు రోడ్డు, రైలు, విమాన, నౌక రవాణా.. కార్గో సేవలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.ఏపీలో 8500 కిలోమీటర్ల జాతీయ రహదారిని ఎన్డీయే హయాంలో విస్తరించామని అలాగే విమాన సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.. ఉడాన్ పథకంతో దేశంలోని చిన్నా, మధ్యతరహా విమానాశ్రయాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ పథకంతో విమాన సౌకర్యం ప్రజలకు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రానుందన్నారు.. దసరా నాటికి రాష్ట్రం నడిబొడ్డున ఉన్న విజయవాడ గన్నవరం విమాన ఆశ్రమంలో అంతర్జాతీయ స్థాయి లో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు
