సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్రం తో కలసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ ఏడాది తొలి విడత అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింది డబ్బుల్ని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా రూ.7వేలు చొప్పున రైతుల అకౌంట్‌లలోకి డబ్బుల్ని విడుదల చేయనున్నారు. ఈ నెల 20వ తేదీన (శనివారం) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తాయి. ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్‌లోని తారకేశ్వర్‌లో పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం నిధులను అదే రోజు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *