సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశం ఏపీ సచివాలయంలోని 5వ బ్లాక్లో నేడు,శుక్రవారం మధ్యాహ్నం 235వ నిర్వహించారు. ఈ భేటీలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు చర్చించారు. లక్ష్యం ప్రకారం రైతులకు రుణాలు ఇవ్వడంలో మంచి దృక్పధం తో వ్యవహరించాలని కోరారు. వ్యవసాయ రంగం, ఎంఎస్ఎంఈలు, స్వయం సహాయ సంఘాలు, కౌలు రైతులకు అందించిన రుణాలపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి రూ.3,86,249కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు బ్యాంకర్లు వివరించారు. ఎంఎస్ఎంఈ రంగానికి రూ.1,17,357కోట్లు, ప్రాధాన్య రంగానికి రూ.5,19,693కోట్ల రుణాలు అందించినట్లు పేర్కొన్నారు.. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో రుణాల పంపిణీ 137 శాతం మేర ఉన్నట్లు సీఎం చంద్రబాబుకు తెలిపారు.
