సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ది కాస్మో పాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ సౌజన్యంతో శుక్రవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ఆధునిక వైద్య పరికరాలతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కాస్మో క్లబ్ అధ్యక్షులు చేకూరి రామభద్రిరాజు మాట్లాడుతూ ఆస్తమాలజి, జనరల్ మెడిసిన్, గైనిక్, ముక్కు, చెవి, గొంతు, ఆర్దోపెడిక్, రేడియాలజీ వంటి వైద్య సేవలతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, ఉచిత పరీక్షలు చేసి మందులను కూడా అందించామన్నారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, వైద్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
