సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెదఅమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్లో శుక్రవారం ఘనంగా నిర్వహించిన విజయోత్సవ సభలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ,రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, మాజీ మంత్రి పిత్రాణి సత్యనారాయణ , మాజీ మండలి చైర్మెన్ షరీఫ్ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకుందని అన్నారు. ఆక్వా రంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆక్వా రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తోందని తెలిపారు.
