సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగ్లాదేశ్‌లో లక్షలాది హిందువులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. హిందువులు ఎక్కువగా ఉండే స్థానిక రంగ్‌పూర్‌లో 81 అడుగుల భారీ శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మాణం నిలిపివేయడంతో అక్కడి ప్రభుత్వంపై ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. ర్యాడికల్ ఇస్లామిస్టులు ఈ విగ్రహా నిర్మా ణాన్ని వ్యతిరేకించడంతో పాటు శ్రీ రాముని ఫోటోను అవమానపర్చడంతో అక్కడి హిందువులు రోడ్లపైకి వచ్చారు. శ్రీశ్రీ రాధా గోవింద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు మతోన్మాదుల నుంచి బెదిరింపులు రావడంతో భద్రతా కారణాలు చూపి ఈ నిర్మానాన్ని నిలిపేశారు. ఈ నేపథ్యంలో ఢాకాలోని షాహ్భాగ్ కూడలి వద్ద హిందువులు భారీ స్థాయిలో నిరసన తెలిపారు. హిందూ మహాజోట్ పిలుపు మేరకు వేలాది మంది హిందువులు, విద్యార్థులు మానవహారాలు, రాత్రి పూట దీపాలతో ర్యాలీ నిర్వహించారు. శ్రీరాముని అవమానించిన బాధ్యులను 72 గంటల్లో అరెస్ట్ చెయ్యాలని లేని పక్షములో బాంగ్లాదేశ్ లోని కోట్లాది హిందువులు ఆందోళన చేస్తామని ప్రభుత్వా నికి అల్టి్మేటం విధించారు.
