సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అనారోగ్యం పాలు కావడం తదుపరి ఆరోగ్యంతో కోలుకున్నాక ఇటీవల పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటూ కూటమి పాలనపై, టీడీపీ పెద్దలపై తనదయిన పంచ్ తో దూకుడు సెటైర్స్ మరల వినిపిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం కొడాలినానిపై నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత చం ద్రబాబు నాయుడుపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యల వ్యవహారంఫై అప్పటిలోనే నమోదు అయ్యిన కేసుపై దర్యాప్తు జరగాలని ఇప్పుడు ఈ తాజా నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *