సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఎనర్జీ – ఎఫిషియంట్ ఇండక్షన్ స్టవ్‌ లు, నాణ్యమైన స్టీల్ పాత్రలను పంపిణీ చేస్తున్న నేపథ్యంలో.. నేడు, సోమవారం భీమవరం నియోజక వర్గం లోని వీరవాసరంలోని 74 అంగన్వాడీ కేంద్రాలకు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎనర్జీ – ఎఫిషియంట్ ఇండక్షన్ స్టవ్‌ లు, స్టీల్ పాత్రలను ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. స్వచ్ఛమైన వంట విధానాన్ని ప్రోత్సహించడం, గ్యాస్ వాడకాన్ని తగ్గించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. రాష్ట్రంలో సుమారు రూ 32 కోట్లతో 55,000 కేంద్రాలకు ఎనర్జీ ఎఫిషియంట్ ఇండక్షన్ స్టవ్‌ లు, స్టీల్ పాత్రలను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *